తెలంగాణ

నేర రహిత తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 22: నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేలా తెలంగాణ పోలీస్ శాఖ ప్రయత్నిస్తుందని ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఫ్రెండ్లీ పోలీస్ విధానాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నామని డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఐటి సెల్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీస్ అధికారులతో ఆయన సమావేశమై పోలీస్ శాఖ పనితీరు, నూతన సంస్కరణల తీరుతెన్నులు, నేరస్థుల సర్వే, క్రైమ్ రేటింగ్‌లను విశే్లషించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు డిజిపిగా తాను చార్జి తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని 31జిల్లాల పోలీస్ విభాగాలు, కమిషనరేట్‌ల సందర్శన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సందర్శనతో పూర్తయ్యిందన్నారు. పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంచి పని పద్థతుల్లో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. నల్లగొండలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఐటి సెల్‌లను ప్రారంభించడం జరిగిందని ఇదే తరహాలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సైబర్ క్రైమ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు తరలివచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి ఇక్కడి పిల్లలకు ఉద్యోగాలు వచ్చే దిశగా కావాల్సిన వాతావరణాన్ని తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకెళుతుందన్నారు. విదేశాల్లో ఎలాగైతే శాంతి, భద్రతలు మెరుగ్గా ఉండటంతో అక్కడికి ఉద్యోగాల కోసం మన పిల్లలను ఎంతో నమ్మకంతో పంపిస్తున్నామో అదే తరహాలో విదేశాల వారు సైతం మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టి ఉండే పరిస్థితులను కల్పించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2018చివరి నాటికి ఈ లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణతో ప్రతి పోలీస్ సిబ్బంది భాగస్వామ్యంతో పారదర్శకమైన, నాణ్యమైన విధి నిర్వహణతో ముందుకెళుతున్నామన్నారు. తెలంగాణను శాంతిభద్రతల నెలవైన రాష్ట్రంగా, నేర రహిత రాష్ట్రంగా తీర్చేదిద్దడం ద్వారా తెలంగాణ అభివృద్ధికి పోలీస్ శాఖ కారణభూతమయ్యేలా పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఐజి స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు, సూర్యాపేట ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, నల్లగొండ ఏఎస్పీ అనంత పద్మనాభ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.