తెలంగాణ

జల వివాదాల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెరుగుతన్న వైషమ్యాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం వలన ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటం తప్ప ఒరిగేది ఏమీ ఉండదని, కనుక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకునేలా చూడాలని తమ్మినేని కోరారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానదిలో 299 టిఎంసిలు, గోదావరిలో 954 టిఎంసిలు చొప్పున తెలంగాణ వాడుకోవాల్సి ఉందని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని తమ్మినేని తెలిపారు.