తెలంగాణ

మహిళలను విస్మరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 7: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకున్నది. దశాబ్ధాల పోరాటం, అమరవీరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను అణగదొక్కాలనుకోవడం అవివేకమన్నారు. ఎన్నికలలో గెలుపు, ఓటములు సర్వ సాధారణమని అయితే కాంగ్రెస్ పార్టీని అణిచి వేయాలనుకోవడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. శాసన సభ్యుడి హక్కుగా దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం బాగుపడేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. చనిపోయిన వ్యక్తిపై మానవత్వం లేకుండా విమర్శలు చేయడం కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చి అవమానపర్చింది టిఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. ఆమెను ఎమ్మెల్సీని ఎందుకు చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారికి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారన్నారు. ముఖ్యంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తుమ్మలను మంత్రిని చేసినపుడు అమరుల త్యాగం గుర్తురాకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల తనకు కుడిభుజం ఎప్పుడు, ఎలా, ఎందుకు అయ్యారో ప్రజలకు చెప్పవల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉందన్నారు. అభివృద్ధి అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వాటిమీద స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.