తెలంగాణ

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 24: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు తయారుచేస్తామని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్‌లో ఉందని వైద్య ఆరో గ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాసుపత్రిలో నూతనంగా ఏర్పా టు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మాతా శిశుసంరక్షణ 50 పడకల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ నంబర్‌వన్‌లో ఉన్నారని అన్నారు. గత పాలకులు ప్రభుత్వాసుపత్రులను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. తమ ప్రభు త్వ హయాంలో ప్రతి పేదవానికి సహాయం అం దేలా అన్ని ఆసుపత్రులలో ట్రామాకేర్, డయాలసిస్, ఎమర్జెన్సీ సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రులలో ఐసి యులు లేవని ప్రస్తుతం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసర సేవలు అందించడానికి ఐసియు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రులు చూస్తే కార్పొరేట్ ఆసుపత్రులుగా కనిపించాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో అధిక ఫీజులు తీసుకుంటారని, పేద ప్రజలు చెల్లించుకోలేని పరిస్థితులలో ఉం టారనే ప్రభుత్వం సర్కార్ దావాఖానల్లో అన్ని వసతులు కల్పిస్తుందని అన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండాలని 102, 108, అంబులెన్సలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. 102 వాహనం ద్వారా గర్భిణీలను ప్రసూతి కోసం ఆసుపత్రికి తీసుకపోవడానికి ఏర్పాటు చేశామని అన్నారు. ఆసుపత్రిలో మరణించిన తరువాత మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవడానికి అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జబ్బుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని , జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. నొప్పుల మాత్ర లు ఎక్కువగా వాడితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి వ్యక్తికి స్క్రీనింగ్ చేయడానికి సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.