తెలంగాణ

వన్యప్రాణుల లెక్కింపు సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: అమ్మో!, అడవి దున్నలు, వేగంగా పరుగెడుతున్న పులులు, సింహాలు, రుయ్‌న దూసుకెళ్ళే చిరుతలు, ఇంకా ఎలుగుబంటి, నక్కలు ఇలా ఎనె్నన్నో వన్యప్రాణులను అభయారణ్యాల్లో లెక్కించడం సాధ్యమేనా?. సాధ్యమేనంటూ స్వయాన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిథిలో ఉట్నూరు సమీపంలో కోలంగూడ రేంజ్‌లో సుమారు ఆరు కిలో మీటర్లు అటవీ శాఖ అధికారులతో పర్యటించి, పలు జంతువుల ఆనవాళ్ళు గుర్తించారు. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అడవుల్లో జంతు గణన ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. పులుల సంరక్షణ ప్రాంతాలైన కవ్వాల్, అమ్రాబాద్‌లో ఆశించిన స్థాయిలో ఉన్నట్లు అక్కడి ఫీల్డ్ డైరెక్టర్లు తెలిపారు. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని బెజ్జూర్ పెంచికల్ పేట, పోతపల్లి, బొంబాయిగూడా బీట్లలో ఎలుగుబంటి ఆనవాళ్ళను అధికారులు గుర్తించారు. కదంబ అటవీ, భూపాల్‌పల్లి అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు, దున్న ల సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ అడవుల్లో పెద్ద సంఖ్యలో అడవి దున్నలు సర్వే చేస్తున్న అటవీ సిబ్బంది కంటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో అరణ్య భవన్ నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరై జంతువుల లెక్కింపును పర్యవేక్షించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న జంత గణన జరగదు. ఆ తర్వాత మిగతా మూడు రోజులూ శాఖాహార జంతువుల లెక్కింపుతో పాటు వృక్ష, మొక్కల జాతుల గుర్తింపు కూడా జరుగుతుంది.