తెలంగాణ

పోలీసులపై ఫిర్యాదులకు అథారిటీ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: సుప్రీం కోర్టు పోలీసు సంస్కరణల అంశంలో ప్రకాశ్ సింగ్ కేసుకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర స్థాయిసెక్యూరిటీ కమిషనన్, పోలీసులపై ఫిర్యాదుల అథారిటీనినాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతోకూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది. గత ఏడాది సింగిల్ జడ్జి కోర్టు ఈ విషయమై ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో పైన పేర్కొన్న రెండు విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈవిషయమై ఆంధ్రప్రభుత్వం, ప్రకాశం జిల్లా ఎస్పీ హైకోర్టు ధర్మాసనం వద్ద సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. హోంశాఖ తరఫున న్యాయవాది విద్యావతి వాదనలు వినిపిస్తూ, సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి సింగిల్ జడ్జికోర్టు ఆదేశాలు లేవన్నారు. సుమోటోగా కోర్టు ధిక్కార కేసును సింగిల్ జడ్జి కోర్టు స్వీకరించిందన్నారు. ఈరెండు విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు ధర్మాసనం నాలుగు నెలల్లోగా సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.