తెలంగాణ

గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 25: వైద్యరంగాన్ని తమ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకెళ్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం సికిందరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంతానం కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలు లక్షలు వెచ్చించలేరని, ప్రభుత్వమే సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేంద్రాలను విస్తరిస్తామని పేర్కొన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్సా విధానానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించామని వెల్లడించారు. ప్రజలు అవగాహన పెంపొందించుకుని ప్రైవేటు వైద్యం కోసం పరుగులు తీయకుండా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలియో మహమ్మారిని ప్రారదోలడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఈనెల 28న నిర్వహిస్తున్న పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, కేంద్రం తరుఫున కావాల్సిన సహకారం అందించడానికి కృషి చేస్తామని వెల్లడించారు. పల్మనాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాంకోస్కోపీని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ కృష్ణమూర్తి, డీఎంఈ రమేశ్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సిం హా రావు పాల్గొన్నారు.