తెలంగాణ

టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యున్నతమైన పారిశ్రామిక విధానాన్ని(టీఎస్ ఐ పాస్) రూపొందించి 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీ పాస్ వల్ల వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, దీని ద్వారా యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తున్నట్టు వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగం పేరిట మోసపోకుండా ఉండేందుకు టాంకాం అనే వ్యవస్థను ఏర్పాటుచేసి నేరు గా విదేశీ సంస్థలతో యువతకు ఉద్యోగాలు కల్పించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 ఉపాధి కల్పన, మూడు ప్రాంతీయ ఉపాధి కల్పన కార్యాలయాలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పా రు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటుచేసి ఆయా వర్గాల వారికి శిక్షణ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 583 జాబ్ మేళాలు ఏర్పాటుచేశామని, 592 కంపెనీలతో సుమారు 10వేల మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పారు. పరిశ్రమల ద్వారా ఉపాధే కాకుండా ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా కూడా స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని, గత పాలకులు చేయని విధం గా ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి వంద కులాలను గుర్తించి వెయ్యి కోట్లతో వారికి ఉపాధి, శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, ఇది ఉపాధికి తొలి మెట్టుగా భావించి అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. యువత ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి కల్పన కోసం తమ మేధో సంపత్తిని, నైపుణ్యాలను వినియోగించాలన్నారు. ఆలేరు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గోదావరి జలాల ద్వారా నిరుద్యోగం దూరం
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఆలేరు నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యకు గోదావరి జలాలు రావడంతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం తో ఎడారిగా మారిన ఆలేరు నియోజకవర్గానికి రానున్న ఖరీఫ్ నాటికి మల్లన్నసాగర్, గంధమళ్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా నీరందించే పను లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నా రు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ యువత మేధో సంపత్తిని ఉపయోగించుకొని స్వయం ఉపాధితో వృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళాలో 35కు పైగా కంపెనీలు పాల్గొనగా, 2,650 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉపాధి శిక్షణ కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీఆర్‌డీఏ పీడీ వెంకట్రావ్, జేసీ రవినాయక్, ఎంపీపీ అనసూర్య, జడ్పీటీసీ పరమేశ్వర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం..మెగా జాబ్ మేళాలో మాట్లాడుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి