తెలంగాణ

భక్తజన సంద్రంగా చెర్వుగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జనవరి 25: పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవానికి చెర్వుగట్టు భక్త జనసముద్రంగా మారింది. సాక్షాత్తూ పరమేశ్వరుడే వరుడిగా, పార్వతీదేవి వధువుగా చెర్వుగట్టు కల్యాణానికి సిద్ధం కావడంతో చెర్వుగట్టు హరినామస్మరణతో మార్మోగిపోయింది. శైవ ఆగమశాస్త్రం ప్రకా రం గురువారం తెల్లవారుజామున సూర్యుడు ఉదయించిన తొలి కిరణాల సమయంలో పరమేశ్వరుడి కల్యాణాన్ని నయనానందకరంగా, కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ శైవ క్షేత్రం చెర్వుగట్టు ఎటుచూసినా భక్తజనంతో కిటకిటలాడింది. అద్దంకి- నార్కట్‌పల్లి రహదారి మొదలుకొని చెర్వుగట్టు పల్లెకు వాహనాలన్నీ బారులు తీరగా, కొండకు భక్తులంతా బారులు తీరడంతో కొండ భక్తజనసముద్రంగా మారింది. ఉత్సవాల ప్రారం భం మరుసటి రోజు కొండపైన గల కల్యాణ మండపంలో పరమేశ్వరుడి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున ప్రారంభమైన స్వామివారి కల్యాణ వేడుకలను వేదాక్షర సరస్వతి బిరుదాంకితులు అల్లవరపు సుబ్రమణ్య దీక్ష అవధాని ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను వధూవరులుగా ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా మండపంలో మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. పరమేశ్వర కల్యాణాన్ని నీలకంఠ శివాచార్య వ్యాఖ్యానంతో ప్రజలను రంజింపజేశారు. లోకాలను పరిపాలించే పరమేశ్వరుడే చెర్వుగట్టు క్షేత్రంలో భక్తుల కోసం రథసప్తమి రోజున భక్తులకు కనువిందు చేయడానికి వధూవరులుగా మండపంలో కూర్చున్నారని, ఇలాంటి అద్భుత సుందర దృశ్యాలను చూసిన ప్రతీ ఒక్కరి జన్మ సాఫల్యం చెందుతుందన్నారు. వధూవరులుగా ఉన్న స్వామి వార్లకు ప్రభుత్వం తరఫున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాలు సమర్పించగా, ఎమ్మెల్సీ పూల రవీందర్, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తలంబ్రాలు సమర్పించారు. కొండపైన జరిగిన ఈ కార్యక్రమం భక్తుల హృదయాలను రంజింపజేసింది. మాంగళ్యధారణ సమయంలో భక్తులంతా శంభో హరహర మహా దేవ అంటూ స్మరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌యస్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆలయ చైర్మన్ నల్ల వెంకన్న, సర్పంచ్ రమణ బాలకృష్ణ, కార్యనిర్వాహణ అధికారి అంజనారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో సురేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ధర్మకర్తలు రాధారపు విజయలక్ష్మి, యామ దయాకర్, కె.శ్రీనివాసులు, మేకల వెంకట్‌రెడ్డి, గౌరీకార్ శ్రీను, మర్రి నర్సింహా, గాదె లతీఫ్, గడ్డం పశుపతి, నాంపల్లి శ్రీనివాసులు, రేగట్టె నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, సహాని, బాలెం బిక్షం తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు..శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం జరుగుతున్న దృశ్యం
*స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే వీరేశం దంపతులు