తెలంగాణ

హైదరాబాద్ వస్తున్న నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ మార్టిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్టిన్ చాల్ఫీ శనివారం నాడు హైదరాబాద్ వస్తున్నారు. 2015, 2016 సంవత్సరాలకు గానూ బి ఎం బిర్లా సైన్స్ ప్రైజెస్‌ను ఆయన అందిస్తారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఎ ఎస్ కిరణ్‌కుమార్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ డి బాలసుబ్రమణియన్ కూడా హాజరవుతారు. అనంతరం మార్టిన్ శాస్తవ్రేత్తలు, విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడతారు. అమైనో ఆమ్లాల అవశేషాలు ఉన్న ప్రోటీన్లను ఆయన కనుగొని ఆ అంశంపై నోబెల్ బహుమతిని పొందారు. అతినీలలోహిత కిరణాలు పడినపుడు అది నీలిరంగు ఫ్లోరోసెస్‌ను ప్రదర్శిస్తుంది. ఈ అంశంపై కూడా ఆయన మాట్లాడనున్నారు.