తెలంగాణ

కేసీఆర్ సర్కార్ చర్యలను ప్రశంసించిన కేంద్ర ఆరోగ్య శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాల సంక్షేమం ప్రవేశపెట్టిన వివాహ సహాయ స్కీంల వల్ల బాలికల్లో పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. కేంద్రప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16-17కు సంబంధించి సర్వేనిర్వహించింది. 15 నుంచి 17 సంవత్సరాలలోపు బాలికలు పాఠశాలలకు వెళ్లడంలో వృద్ధిరేటు 76 శాతం నమోదైంది. పదేళ్ల క్రితం 2005-06 సంవత్సరంలో రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య 23 శాతం ఉండేది. అలాగే పాఠశాలలకు వెళ్లే బాలుర సంఖ్య 46 శాతం నుంచి 81 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో ఈ వయస్సులో పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య 60 శాతం నమోదైంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 70శాతం నమోదైంది. రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలో పేద కుటుంబాల్లో యువతుల వివాహానికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ స్కీంలను ప్రవేశపెట్టింది. దీని వల్ల బాలికలు నిశ్చింతంగా వెళ్లి చదువుకుంటున్నారు. పైగా చట్ట ప్రకారం బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలనే ఆలోచనతో బాలికల తల్లి తండ్రులు ఉన్నారు. కేంద్రం కూడా కెసిఆర్ ప్రభుత్వం పేద యువతుల పెళ్లిళ్లకు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రశంసించింది. విద్యా ప్రమాణాలు పెరిగేందుకు ఈ స్కీం దోహదపడుతోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పేర్కొంది. ఈ స్కీం వల్ల ఇంతవరకు 3.02 లక్షల మంది యువతులకు లబ్ధి చేకూరింది. గత మూడున్నర సంవత్సరాల్లో దాదాపు రూ.1807 కోట్ల నిధులను ఖర్చుపెట్టారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టేందుకు ఈ స్కీం కల్పతరువుగా మారిందని ఈ సర్వే ప్రశంసించింది. కల్యాణ లక్ష్మి స్కీం లబ్ధిని పొందాలంటే కచ్చితంగా యువతికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రాష్ట్రంలో బాల్యవివాహాల సంఖ్య 629 వరకు 2014-15లో నమోదై ఉండగా, 2017-18లో 316 నమోదయ్యాయి. అనేక సంవత్సరాలుగా లెక్కలేనన్ని పథకాలను అమలు చేస్తున్నా రాని సత్ఫలితాలు పెళ్లి సహాయం పేరిట అమలు చేస్తున్న పథకాల వల్ల చేకూరుతున్నాయి. బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల యువతులకు ప్రస్తుతం రూ. 75,116 చొప్పున ఇస్తున్నారు. ఈ స్కీంను రూ. 51,000 తో మొదలు పెట్టారు. వచ్చే బడ్జెట్‌లో ఈ స్కీం ను రూ.1,00,116కు పెంచనున్నారు.