తెలంగాణ

జాతి పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్ర భారత దేశంలో ప్రతి ఒక్కరూ జాతి అభ్యున్నతికి పాటుపడాలని తెలంగాణ ఆర్టీసి మేనేజింగ్ డైరక్టర్ జివి రమణారావు అన్నారు. ఆనాటి మహనీయుల స్ఫూర్తితో సంస్థ అభ్యున్నతి కోసం అంతా సమన్వయంతో పని చేయాలని అన్నారు. శనివారం నాడిక్కడ బస్ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎండి జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు భావితరాలకు పదిలంగా అందించడమే కాక జాతి ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. సంస్థ సిబ్బంది క్రమశిక్షణకు, అంకితభావానికి మారుపేరుగా నిలవాలని ఆకాంక్షించారు. టిఎస్‌ఆర్టీసికి దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, అదే స్థాయిని నిలబెట్టుకునేందుకు మరింత కృషి అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడి, సంస్థ కార్యదర్శి రవీందర్, అధికారులు సత్యనారాయణ, వేణు, యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎంప్లాయిస్ యూనియన్
ఆధ్వర్యంలో..
టిఎస్‌ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు ఎస్.బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ, సర్ధార్ వల్లభభాయ్ పటేల్, అంబేద్కర్ వంటి మహానుభావులు దేశాన్ని సమైక్యపర్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు.

చిత్రం..గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న ఆర్టీసి మేనేజింగ్ డైరక్టర్ జివి రమణారావు