తెలంగాణ

దేశాన్ని వెనక్కు తీసుకువెళ్లిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: దేశాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కు తీసుకువెళ్లిందని, స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిందని బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.బిజెపి కార్యాలయంలో 69వ భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు ఎంపి బండారు దత్తాత్రేయ, బిజెపి పక్ష నేత ఎన్ రామచంద్రరావు, ఎన్ ఇంద్రసేనారెడ్డి, ప్రొఫెసర్ శేషగిరిరావు, చింతాసాంబమూర్తి, మేచినేని కిషన్‌రావు, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నియంతృత్వ ఆలోచనతో పేదరికం, ఉగ్రవాదం, తీవ్రవాదం హెచ్చుమీరాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం దేశ ప్రజలు అంతా పునరంకితం కావాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేశం ముందా, వ్యక్తి ముందా అనే ప్రశ్న వేసుకుని దేశం ముందు అనే భావనతో సాగాలని పేర్కొన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీయడానికి విచ్ఛన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఈ పోరాటంలో రాజ్యాంగమే విజయం సాధిస్తుందని చెప్పారు.