తెలంగాణ

రాష్ట్రంలో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: దేశంలో, రాష్ట్రంలో యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీ భవన్ ఆవరణలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని పాలకులు అవమానిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ పేరిట ఉన్న ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పేరును మార్చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అని పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎంపి వి.హనుమంత రావు, ఎఐసిసి కార్యదర్శి మధుయాష్కిగౌడ్, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు.