తెలంగాణ

కర్ణిసేన నేత అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, జనవరి 26: సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావత్‌కు నిరసగా గుర్గావ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కర్ణిసేన జాతీయ ప్రధాన కార్యదర్శి సూరజ్‌పాల్ అమును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో శాంతి భద్రతకలు విఘాతం కల్పించి హింసకు ఆజ్యం పోశాడని అతడిపై కేసు నమోదు చేశారు. నిజానికి గురువారమే అతడిని పోలీసులు అదుపుకోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సూరజ్‌పాల్‌ను నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసు ప్రతినిధి రవీందర్ కుమార్ వెల్లడించారు. బుధవారం వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. వాహనాలు, ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడి చేశారు. పాతిక మంది విద్యార్థుతో వెళ్తున్న స్కూల్ బస్సును ఆపేసి దగ్ధం చేశారు. అయితే స్కూల్ బస్సు, సొహానాలో ఆర్టీసి బస్సు దహనానికి సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం కర్ణిసేన పేరును ప్రస్తావించలేదు.‘నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారన్న కారణంతోనే సూరజ్‌పాల్‌ను అరెస్టు చేశాం. ఎంజీ రోడ్డులో మద్దతుదారులతో భేటీకి అతడు ప్రయత్నించాడు. డీఎల్‌ఎఫ్ ప్రాంతంలోని నివాసం నుంచి సూరజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నాం’అని పోలీసులు వెల్లడించారు.