తెలంగాణ

సాహిత్యంలో కొత్త ధోరణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: ప్రపంచవ్యాప్తంగా మహిళల జీవిత చిత్రీకరణలో కొత్త ధోరణులు వస్తున్నాయని, స్పెయిన్ దేశంలోనూ నూతన రచయితలు సరికొత్త సంప్రదాయాలకు తెరతీశారని ఆదేశానికి చెందిన క్రిస్టియానా సాంచెజ్ అండ్రాడే పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే హైదరాబాద్ సాహిత్య ఉత్సవాలు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ఈ ఉత్సవాలను అంతర్జాతీయ దృక్పథంతో నిర్వహిస్తోంది. ఈ ఏడాది బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో ఇవి ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల్లో పలు సాహిత్య, సామాజిక అంశాలపై 30కిపైగా సదస్సులు, సాంస్కృతిక చర్చా కార్యక్రమాలు, వర్కుషాప్‌లు, ప్రదర్శనలు జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను గోతి జంట్రమ్ సంస్థ చేసింది. ఈ వేడులకు ఈసారి స్పెయిన్ అతిథి దేశంగా హాజరవుతోంది. 15కు పైగా రాష్ట్రాలు, 10 విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. సాహిత్యం, సంస్కృతి, సామాజిక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా పాదుకుంటున్న ధోరణులు, దృక్పధాలను అంతర్జాతీయ దృక్కోణంతో చూసే ఈ ఉత్సవాల్లో హేమాహేమీలు పాల్గొంటున్నారు. ఉత్సవాలకు అజయ్ గాంధీ, అమితా దేశాయ్, కినె్నర మూర్తి, శ్రీనివాసమూర్తి, జిఎస్‌పి రావు, టి విజయకుమార్‌లు డైరెక్టర్లుగా వ్యవహరిస్తుండగా, కెటిరామారావు ప్యాట్రన్‌గానూ, జయేష్ రంజన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి రోజు మహిళా జీవితచిత్రణలో వస్తున్న ధోరణులపై క్రిష్టియానాతో పాటు ఇన్మా లోపజ్ సిల్వ, మార్సెడెస్ చాబ్రియన్, అలెండ్రో పాలొమాస్ పాల్గొన్నారు.