తెలంగాణ

చర్లపల్లిలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కుషాయిగూడ, జనవరి 26: కూరగాయల వ్యాపార స్ధలం లో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి కాల్పులకు దారితీసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ మల్లాపూర్ మర్రిగూడకు చెందిన గజరాజాసింగ్(55) చర్లపల్లి ఈసీనగర్ కాలనీలో వారంతపు సంతలో కూరగాయల అమ్ముకునే వ్యాపారం చేస్తు జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సంతలో కూరగాయల వ్యాపార స్ధల విషయంలో తులసిబాబుతో వివాదం తలెత్తడంతో ఇరువురి మధ్య గొడవకు దారిసింది. గజరాజాసింగ్ కొడుకులు ధర్మేంద్ర, అమర్, బబ్లూతో కలసి తులసి బాబు, చంద్రశేఖర్, శంకర్, పవన్‌లు సంతలో గొడవవ పడుతు దాడి చేశారు. కోపోద్రిక్తుడైన గజరాజా సింగ్ మర్రిగూడలోని ఇంట్లోకి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి చంపుతానంటూ గాలిలోకి కాల్పులు జరిపాడు. చర్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చక్రపాణి, హోగార్డులు చాకచక్యంగా గజరాజా సింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గజరాజా సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గాయపడిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అల్వాల్ డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఎసీపీ కృష్ణముర్తి, సీఐ చంద్రశేఖర్, ఏస్సైలు చంద్రశేఖర్, అశోక్‌కుమార్, శ్రీశైలం నాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌కు అభినందన
కాల్పుల కేసులో చాకచక్యంగా వ్యవహారించిన కానిస్టేబుల్‌ను కమిషనర్ మహేష్ భగవత్ ఆభినందించి కానిస్టేబుల్ చక్రపాణికి రూ.10 వేలు, హోంగార్డుకు రూ.5 వేలు రివార్డును ప్రకటించారు.

చిత్రం..కేసు వివరాలను వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్