తెలంగాణ

వీరేశం పాత్రపై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 26: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో నకిరేకల్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వీరేశం ప్రమేయముందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చింతకుంట్ల రాంబాబు, మాండ్ర మల్లేశ్, శరత్‌లతో ఎమ్మెల్యే వీరేశం కలిసి ఉన్న ఫొటోలను శుక్రవారం విలేఖరుల సమావేశంలో సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బయట పెట్టడం సంచలనం రేపింది. నిందితులు ప్రస్తుతం టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా ఉన్నందున వారు ఎమ్మెల్యే వీరేశంతో ఫొటోలు దిగినట్లుగా భావిస్తున్నప్పటికీ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోమటిరెడ్డికి వ్యతిరేకంగా వీరేశం రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నాడనడానికి ఈ ఫొటోలు నిదర్శనంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, వీరేశంకు మధ్య రాజకీయంగా గత కొంతకాలం తీవ్ర వైరం సాగు తోంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా, డీసీసీబీ సీఈవోను వీరేశం ఫోన్‌లో దుర్భాషలాడిన సందర్భంగా కోమటిరెడ్డికి, వీరేశంకు మధ్య మాటల యుద్ధమే సాగింది. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే ఎమ్మెల్యే వీరేశం తన ప్రధాన అనుచరుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేయించాడని కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి సైతం నిందితులకు సహకారం అందించాడంటూ కోమటిరెడ్డి చెబుతున్నారు. మొత్తంగా టఆర్‌ఎస్ నాయకులే రాజకీయ కోణంలో శ్రీనివాస్‌ను స్థానిక డీఎస్పీ సహకారంతో హత్య చేశారంటూ తాజా ఫోటోల ద్వారా కోమటిరెడ్డి తన వాదనను సమర్ధించుకుంటున్నారు. అంతేగాక తప్పించుకున్న ప్రధా న నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు వీరేశం స్వగ్రామం ఉట్కూరులో తలదాచుకున్నట్టు కోమటిరెడ్డి ఆరోపించడం సైతం పోలీసుల విశ్వనీయతకు సవాల్ విసురుతుంది. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే తప్ప శ్రీనివాస్ హత్య కేసులో అసలు నేరసులెవరన్న వివరాలపై స్పష్టత రానుంది. మరోవైపు శ్రీనివాస్‌ను హత్య చేసిన వారిలో ప్రధాన నిందితులు గా భావిస్తున్న చింతకుంట్ల రాంబాబు, మాండ్ర మల్లేశ్, శరత్‌లు శుక్రవారం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. వారు ముందు రోజు నుండి పోలీసుల అదుపులోనే ఉన్నా శాంతిభద్రతల నేపధ్యంలో వారి వివరాలపై పోలీస్ శాఖ గోప్యత పాటిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న మెరుగుగోపి, మాతంగి మోహన్, కత్తుల చక్రీ, దుర్గయ్యలు పోలీసుల అదుపులో ఉన్నారు.
చిత్రం..శ్రీనివాస్ హత్య కేసు నిందితులతో ఎమ్మెల్యే వీరేశం కలిసి ఉన్న ఫొటో