తెలంగాణ

తప్పుదారి పట్టిస్తున్న సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: పాఠశాలల్లో ఫీజుల విషయంలో సంఘాలు తప్పుదారి పట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం చేస్తున్న ఆరోపణలు నిర్హేతుకమని, అసత్యమని, అన్యాయమని, ఆమోదయోగ్యం కానివని అన్నారు. కేవియట్ దాఖలు అంశం ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య జరిగే కార్యక్రమమని, ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాశాఖ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించడం దురదృష్టకరమని అన్నారు.
ఒకే ప్రశ్నాపత్రం
దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, దంతవైద్య కోర్సులకు నిర్వహించే నీట్‌లో ఈ ఏడాది నుండి ఒకే సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు సిబిఎస్‌ఇ పేర్కొంది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎఫ్ ఎ నజీర్‌లతో కూడిన ధర్మాసనానికి సిబిఎస్‌ఇ ఈ మేరకు అఫిడవిట్ ఇచ్చింది. గతంలో హిందీ, ఇంగ్లీషు సహా దాదాపు పది ప్రాంతీయ భాషల్లో వేరువేరు ప్రశ్నాపత్రాలతో విద్యార్ధులు నీట్ పరీక్ష రాశారు. ఈ విధంగా వేరువేరు ప్రశ్నాపత్రాలతో పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్ధుల సామర్ధ్యాలను వెలికితీయడం సాధ్యపడదని, ఇది ఆమోదయోగ్యంగా లేదని గతంలో సుప్రీంకోర్టు సిబిఎస్‌ఇకి స్పష్టం చేసింది. అన్ని ప్రశ్నాపత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలు అన్నీ ఒకే స్థాయిలో ఉన్నపుడు వేర్వేరు ప్రశ్నాపత్రాల సెట్లు ఉండటంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సిబిఎస్‌ఇ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టు చేసిన సిఫార్సుల మేరకు ఈ ఏడాది విద్యాసంవత్సరం నుండి నీట్‌లో ఒకే ప్రశ్నాపత్రాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా చర్యలు తీసుకుంటామని సీబీఎస్‌ఇ పేర్కొంది.