తెలంగాణ

జాతరలో హైటెక్ సెక్యూరిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 26: మేడారం జాతరకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బందోబస్తు కోసం పోలీసుల సంఖ్యను పెంచటంతోపాటు ఈ జాతరలో అధునాతన టెక్నాలజీని వినియోగించటం ద్వారా జాతర సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ జాం, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, సమస్యలు ఏర్పడినపుడు వాకీటాకీల ద్వారా ఆలస్యంగా సమాచారం తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుక తంటాలు పడే పోలీసు యంత్రాంగం ఈ సారి అధునాతన పరికరాల వినియోగం ద్వారా ఎప్పటికపుడు సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో నిమగ్నమయింది.
మేడారం జాతరకు కోటిమందికిపైగా జనం వస్తుండటం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తక్కువ పరిధితో ఉండే మేడారానికి అమ్మవార్లను దర్శించుకునేందుకు చేరుకుంటుండటంతో తరచుగా ట్రాఫిక్ జాంలు ఏర్పడటం ప్రతి జాతరలో మామూలు వ్యవహారంగా మారింది. అదే విధంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు చాంతాడంతగా పెరిగిపోవటం, క్యూలైన్‌ను కంట్రోల్ చేయటానికి పోలీసుల అష్టకష్టాలు పడటం కూడా ప్రతిసారి జరిగే తతంగంగా మారింది. ఈ సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ ప్రత్యేక చొరవ తీసుకుని అధునాతన టెక్నాలజీని వినియోగించేలా ఏర్పాట్లు చేసారు. జాతర ప్రాంతంలో భక్తులు ఒకచోట పెద్దసంఖ్యలో గుమికుడినా, నిలచిపోయినా వెంటనే తెలుసుకునేందుకు క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల సహాయంతో ట్రాఫిక్ జాం ఏర్పడిన ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలోని పోలీసు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయటం ద్వారా ట్రాఫిక్ జాంను తొలగించటం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. భారీసంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో వాహనాల జాంలు ఏర్పడకుండా, జాతర ప్రాంతంలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా నాలుగు డ్రోన్ కెమెరాలను పోలీసు యంత్రాంగం వినియోగిస్తోంది. ఇప్పటికే జాతరకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రయోగాత్మకంగా డ్రోన్ కెమెరాల వినియోగం ప్రారంభించారు.
మేడారంలోని అమ్మవారి గద్దెల వద్ద తొక్కిసలాటకు అవకాశం ఏర్పడకుండా పర్యవేక్షించేందుకు ఆరు క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం గద్దెల వద్దకు వెళ్లే సమయంలో వారి సంఖ్యను లెక్కించి కంట్రోరూంకు చేరవేస్తుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో నిర్ధేశించిన సమయంలో వారు గద్దెల నుంచి బయటకు వెళ్లేది, లేనిది ఈ కెమెరాల సహాయంతో అంచనావేసి గద్దెల వద్ద విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిని కంట్రోర్ రూం సిబ్బంది అలర్ట్ చేస్తారు. జాతరకు వచ్చే భక్తులు భయపడేది భారీ రద్దీలో తమ పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని. గంటల తరబడి పిల్లల జాడ తెలియక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాభరా పడటం తప్పనిసరిగా మారిన పరిస్థితుల్లో అధునాతన టెక్నాలజీ ద్వారా ఈ ఆందోళనను తగ్గించే ప్రయత్నానికి పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే మేడారంలో పదిచోట్ల వీఎంఎస్ బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు. వీటి సహాయంతో తప్పిపోయిన పిల్లల ఫొటోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రదర్శించటం ద్వారా తొందరగా ఆచూకీ కనుకొనేందుకు అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, జాతరలో రద్దీ, దొంగతనాల నివారణ, బందోబస్తు పర్యవేక్షణకు సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే 10 రేడియల్ కిలోమీటర్ల పరిధిలోని గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ కాంప్లెక్స్, జంపన్నవాగు, రెడ్డిగూడెం, చిలుకలగట్టు, వనంరోడ్డు, ఇంగ్లీష్ మీడియం స్కూల్, పోలీసు క్యాంపు, మేడారం వై-జంక్షన్ తదితర ప్రాంతాల్లో 200కుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. మేడారం జాతరకు భారీగా జనాలు వచ్చే క్రమంలో కొన్ని సందర్భాలలో ఇంటర్‌నెట్ సేవల నిలచిపోయే అవకాశం ఉండటంతో, శాఖాపరంగా ఈ సమస్య పరిష్కరించేందుకు ఇంట్రానెట్ సేవలను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసారు. మేడారం వచ్చే భక్తులకు కోసం సవివరమైన సమాచారంతో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటుచేసారు.