తెలంగాణ

మేథోసంపత్తి హక్కులు వాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో రైతులు ఏళ్లతరబడి సాగుచేస్తున్న పంటల రకాలపై మేధోసంపత్తి హక్కులను సాధించుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి సూచించారు. ‘రైతుల హక్కులు, వ్యవసాయ జీవ వైవిద్యం’ అంశంపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఏళ్ల నుండి రైతులు తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటలపై హక్కులు పొందేందుకు పంటరకాల సంరక్షణ, రైతు హక్కుల సాధికారత సంస్థ (పిపివి అండ్ ఎఫ్ ఆర్) లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అంశంపై వ్యవసాయ అధికారులు, విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు రైతులకు సహకారం అందించాలని కోరారు. రైతుల హక్కులను కాపాడేందుకు రూపొందించిన ఈ చట్టం గురించి స్థానిక భాషల్లో ప్రచారం చేయాలని కోరారు. ఈ చట్టంపై వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. హైదరాబాద్‌లో పిపివి అండ్ ఎఫ్ ఆర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి. రాజేందర్ ప్రకటించారు. పంటల రకాల నమోదులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ అంశంపై ప్రోత్సాహం అందించేందుకు ఉత్తమ సమూహాలకు 10 లక్షల రూపాయలు, రైతులకు లక్షన్నర రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నామని గుర్తు చేశారు. పంటల రకాల నమోదుచేసే అంశంలో వ్యవసాయ యూనివర్సిటీ కృషి చేస్తుందని వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక పోర్టల్‌ను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిపివి అండ్ ఎఫ్ ఆర్ అథారిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్‌సి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఐదు రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.