తెలంగాణ

శ్రీనివాస్ హత్యపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: నల్లగొండ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, నిష్పక్ష పాతంగా ఉండేందుకు సిబిఐ విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర డిజిపిని కోరారు. శనివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంతరావు, టి.పిసిసి కోశాధికారి గూడురు నారాయణరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరులు అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం నుంచి రాష్ట్ర డిజిపి కార్యాలయానికి పాదయాత్రగా వెళ్ళి, డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. శ్రీనివాస్‌కు ప్రాణ హాని ఉందని చెప్పినా, పోలీసులు భద్రత కల్పించలేదని వారు డిజిపికి చెప్పారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భద్రత పెంచాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిజిపిని కోరారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేయడంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వీరేశం కీలక పాత్ర ఉందని ఆరోపించారు. ఇందుకు తమ వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలను డిజిపికి అందజేశామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే వీరేశం నుంచి తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అండ చూసుకుని ఎమ్మెల్యే వీరేశం అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్‌లో చేరని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, చివరకు హత్యలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. శ్రీనివాస్ హత్య ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుల నేరపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఇలా హత్యా రాజకీయాల కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఉండేందుకు సిబిఐ విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ హత్య గురించి తమపైనే టిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలా హత్యలు చేసుకుంటూ పోతే చివరకు కత్తులే మిగులుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రాజకీయంగా గెలవలేక ఇలా హత్యలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
చిత్రం..బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ డీజీపీకి వినతిపత్రం అందజేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు