తెలంగాణ

ఎమ్మెల్యే క్వార్టర్స్ ఫిబ్రవరిలో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: హైదరాబాద్‌లో (హైదర్‌గూడా) నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణాన్ని రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం తనిఖీ చేశారు.
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌లతో కలిసి మంత్రి తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్లను తనిఖీ చేస్తూ, ఫిబ్రవరి వరకు అన్ని క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన వెంటనే వీటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. 120 ఎమ్మెల్యే క్వార్టర్లతో పాటు 120 సర్వెంట్ క్వార్టర్లు, 36 స్ట్ఫా క్వార్టర్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం 132.73 కోట్ల రూపాయలను కేటాయించగా, ఇప్పటి వరకు 118.15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు 70 క్వార్టర్ల నిర్మాణం పూర్తికాగా, మిగతా 50 క్వార్టర్ల నిర్మాణం పురోగతిలో ఉందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

చిత్రం..ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాల తనిఖీ అనంతరం అధికారులతో మాట్లాడుతున్న
మధుసూదనాచారి, పద్మాదేవేందర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు