తెలంగాణ

మాకేమిటి సంబంధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా అది టిఆర్‌ఎస్ ప్రమేయంతోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని కర్నె ప్రభాకర్ శనివారం పార్టీ ఎమ్మెల్యే కిషోర్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. నేరెళ్ళలో ప్రమాదవశాత్తు లారీ కింద పడి మరణించిన ఘటన, ఖమ్మం జిల్లాలో కుటుంబ కలహాల వల్ల జరిగిన హత్య నుంచి మొదలుకుని తాజాగా నల్లగొండలో జరిగిన శ్రీనివాస్ హత్య వరకూ తమపై కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని కర్నె తెలిపారు. శ్రీనివాస్ హత్యకు టిఆర్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదని, శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుంగు శిష్యుడని, ఇప్పుడు ఆయనను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంబాబు, మల్లేష్, శరత్‌లు కోమటిరెడ్డి శిష్య బృందంలోని సభ్యులేనని ఆయన తెలిపారు. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి, విహెచ్ శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నె విమర్శించారు.