తెలంగాణ

వానాకాలం నాటికి పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న పనులను వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని భారీసాగునీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం ఇక్కడ జలసౌధలో నాగర్‌కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి పనులును ఆయన సమీక్షించారు. కల్వకుర్తి ప్యాకేజీ 29,30 పనుల పురోగతి బాగుందన్నారు.
2016-17లో మొత్తం కల్వకుర్తి కింద 280 చెరువులు నింపకగా, ఈ ఏడాది 350 చెదరువులు నింపామన్నారు. ఇందులో నాగర్‌కర్నూలు పరిధిలో 120 చెరువులను నింపినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. కల్వకుర్తి కింద మొత్తం ఆయకట్టు 4.25 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఈ ఏడాది యాసంగిలో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసినట్లు వారు చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు చేయని పక్షంలో ఏజన్సీని తొలగించి కొత్త సంస్థకు పనులు అప్పగించాలన్నారు.

చిత్రం..కల్వకుర్తి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు