తెలంగాణ

‘బైసన్‌పోలో’పై తుదిదశకు చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో మైదానంలో సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ కల త్వరలో సాకారం కానుంది. ఈ దిశగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. 60 ఎకరాల్లో బైసన్‌పోలో మైదానం విస్తరించి ఉంది. ఈ మైదానంలోనే సచివాలయం, అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయాలు, వీటి ఆధీనంలో ఉన్న రోడ్డును కూడా వెడల్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై కూడా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. దీనివల్ల రక్షణ మంత్రిత్వ శాఖ 60 ఎకరాలను కోల్పోనుంది. కాగా తమకు ఐదు వందల ఎకరాల స్థలం, రూ.92 కోట్ల నష్టపరిహారం కావాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ రెండు అంశాలకు తెలంగాణ ప్రభుత్వ అంగీకరించింది. కాని రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బైసన్‌పోలో మైదానం తదితర చోట్ల అనేక స్ధలాలను రక్షణ మంత్రిత్వ శాఖ లీజుకు ఇచ్చింది. ఇక్కడ అనేక ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. వీటివల్ల కేంద్రానికి ఆదాయం వస్తోంది. ఈ లీజు ఆదాయం కోల్పోతామని, దీనికి ప్రత్యామ్నాయంగా తమకు రూ.60 కోట్ల సొమ్మును నష్టపరిహారంగా ఇవ్వాలని కేంద్రం కోరినట్లు తెలిసింది. కాని ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది. ఈ అంశంపై కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖతో ముఖ్యమంత్రి త్వరలో నేరుగా మాట్లాడి లైన్ క్లియర్ చేసి సచివాలయం పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రిత్వ శాఖ అడిగిన 500 ఎకరాలకు వికారాబాద్, మహబూబ్‌ననగర్, వనపర్తి, నిజామాబాద్, నల్లగొండ తదితర చోట్ల ఖాళీ స్థలాలను మిలిటరీ అధికారులకు తెలంగాణ అధికారులు చూపెట్టారు. కేంద్ర రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు జింఖానా, బైసన్‌పోలో మైదానం అప్పగించేందుకు, రాజీవ్ రహదారి వెడల్పుకు అవసరమైన స్ధలాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ తెచ్చిన నష్టపరిహారం ప్రతిపాదనపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలిసింది.