తెలంగాణ

పోలీసు శాఖకు ఆదర్శప్రాయుడు వ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: దివంగత ఐపీఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్ పోలీస్ శాఖకు స్ఫూర్తిదాత అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావానికి మారుపేరు అని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులకు ఆయన ఒక రోల్ మోడల్‌గా నిలుస్తారని పేర్కొన్నారు. ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్‌లో నిర్వహించిన వ్యాస్ 22వ స్మారకోపన్యాస కార్యక్రమానికి పలువురు సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డు డిజిపిలు హాజరయ్యారు. వ్యాస్ సతీమణి అరుణా వ్యాస్, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ జితేందర్, డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి హాజరు కాగా, ముఖ్య అతిథిగా ఇస్రో మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. తొలుత వ్యాస్ చిత్రపటం వద్ద జ్వోతిప్రజ్వలన చేసి నివాళులర్పించారు. స్మారకోపన్యాసానికి పోలీస్ అకాడమి డైరక్టర్ జితేందర్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అరుణా వ్యాస్ మాట్లాడుతూ, వృత్తికి ఏవిధంగా సేవ చేయాలనే నిరంతర తపనే తప్ప వ్యాస్‌లో మరో ధ్యాస ఉండేది కాదని అన్నారు. 1988లో ట్రాఫిక్ డిసిపిగా ఉన్నప్పుడే హెల్మెట్లు వాడాలని చెబుతూ ఉండేవారని అన్నారు. మావోయిస్టులను ఏరివేసేందుకు 1989లో గ్రేహౌండ్స్ అనే కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. చాలా మందిలో పోలీస్ అంటే సరైన గౌరవం లేదని, నిజమైన గౌరవం తెచ్చే విధంగా యువ అధికారులు పని చేయాలని కోరారు. అనంతరం డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క యువ పోలీసు అధికారి వ్యాస్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ వ్యాస్‌ను కిరాతకంగా పొట్టనబెట్టుకుందని ఆవేదనతో అన్నారు. సాహసానికి, సమన్వయానికి, ఉత్తమ పోలీసింగ్ విధానాలకు వ్యాస్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అన్నింటికీ మించి ఆయన ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో మాజీ చైర్మన్ ప్రొ ఎఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఇస్రో ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్ల పనితీరు గురించి వివరించారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇస్రో సేవలను కోరుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇస్రో పంపిన అనేక శాటిలైట్ల ప్రయోజనాలకు తమకు కూడా అందించాలని కోరుతున్నాయని తెలిపారు. ఇస్రో టెక్నాలజీతో రూపొందించిన అనేక అప్లికేషన్స్ వల్ల రోడ్ నేవిగేషన్, వాహన ట్రాకింగ్ విధానం, రైల్వేలో సెక్యూరిటీ, మత్స్యకారుల కోసం ప్రత్యేక మొబైల్ సేవలు, డిజాస్టర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, శాంతిభద్రతల విభాగం పర్యవేక్షణ వంటి అనేక అంశాలకు ఎంతో ఉపయోగంగా ఉందని తెలిపారు. పోలీసు అకాడమిలో శిక్షణలో ఉన్న వారికి స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని షెడ్యూల్స్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా పౌరులకు కావాల్సిన సేవలను వారికి అందించినట్లు అవుతుందని అన్నారు.
చిత్రం..వ్యాస్ స్మారకోపన్యాస సభలో ప్రసంగిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి