తెలంగాణ

ఉద్యోగాల రిజర్వేషన్లపై శే్వతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో ఎస్సీ ఉద్యోగ రిజర్వేషన్లు అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఎలుగెత్తిన గళం- దళిత్ అదాలత్’ పేరుతో గోడపత్రికను శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్ మాట్లాడుతూ, ఇళ్లు లేని దళితులకు రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇస్తామని కెసిఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినా, నేటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. స్పెషల్ డ్రైవ్ కింద ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలుచేయాలని అన్నారు. ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కార్యదర్శి జాజుల గౌరి, ఎస్సీ మోర్చ ప్రధానకార్యదర్శులు బోసుపల్లి ప్రతాప్, కుంభాల గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ బాగ్డే, రాష్ట్ర అధికార ప్రతినిధులు సెగ్గం రామకృష్ణ, పరిమల్ కుమార్, వాల్మీకి సెల్ కన్వీనర్ సతీష్‌బిడ్ల, కాంతిలాల్, ఎస్సీ మోర్చ హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాదరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.