తెలంగాణ

భారీగా తగ్గిన ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం నుంచి రూ.15 వేల కోట్ల ఎగుమతులు తగ్గాయని సిపిఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఇక్కడ శనివారం జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో సంస్కరణలను మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు సబ్సిడీల కోత పెంచేందుకు ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారని ఆయన తెలిపారు. ద్రవ్య లోటు మరింత పెరగనున్నదని, వ్యవసాయానికి భరోసా లభించేలా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జహీరాబాద్, జడ్చర్ల, దారమచర్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రై-పోర్టులు మంజూరు చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఎంఎంటిఎస్ వంటి పథకాలను పూర్తి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర కిమటీ సమావేశాలు వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు నల్లగొండలో జరుగుతాయని చెప్పారు.