తెలంగాణ

ఉద్యోగాల పేరిట వంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హైదరాబాద్ నగర పాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాసా రాజశేఖర్ (29), రాసా రమాకాంత్ (25)లు అమాయకులను నమ్మించి డబ్బు గుంజుతున్నారు. వీరి ఉచ్చులో ఏడుగురు బాధితులు చిక్కుకుని భారీగా డబ్బు చెల్లించారు. పి.కళ్యాణి రూ.50 వేలు, బేకు సాయికిరణ్ రూ.50 వేలు, వై.నవనీతరావు రూ.50 వేలు, బి.శ్రీనివాస్ రూ.50 వేలు, క్రాంతి రూ.50 వేలు, గోపింద్‌రెడ్డి రూ.50 వేలు, చెరుకుపల్లి సురేందర్‌రెడ్డి రూ.15 వేలు ఉద్యోగాలు ఇప్పిస్తానంటే సమర్పించుకున్నా రు. సులభంగా డబ్బు సంపాదించి జల్సా చేసేందుకు ఇద్దరునిందితులు ఇలా అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నారు. తమకు జిహెచ్‌ఎంసిలో ఉన్నత స్థాయిలో అధికారులు తెలుసునని నమ్మకంగా చెప్పి ఆ తర్వాత డబ్బు గుంజుతున్నారు. అమాయకులైన వారు నమ్మి వస్తే జూనియర్ అసిస్టెంట్‌కు రూ.3 లక్షలు, అటెండర్ ఉద్యోగానికి రూ.2 లక్షలు జిహెచ్‌ఎంసి అధికారులు తీసుకుంటున్నారని చెబుతున్నారు.
నిందితులను అరెస్టు చేసి రూ.1.15 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, నకిలీ నియామక పత్రా లు, జాయినింగ్ రిపోర్టులు, విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, ఇతర ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న వాటిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించినట్లు డిసిపి వివరించారు. టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఎస్‌ఐలు కెఎస్ రవి, పి.చంద్రశేఖర్ రెడ్డి, కె.శ్రీకాంత్, బి.శ్రావణ్‌కుమార్‌లు ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు.