తెలంగాణ

విజయవంతంగా పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ హైదరాబాద్ (జూబ్లిహిల్స్) లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న బస్తి దవాఖానలో ఒక పాపకు పల్స్‌పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. ఇందుకోసం 22,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో సహా గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా మరో 787 సంచార టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజులపాటు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఏవైనా కారణాల వల్ల ఆదివారం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తమ పిల్లలను తీసుకురాలేకపోతే అలాంటి వారికి వారి వారి ఇళ్ల వద్దనే పోలియో చుక్కలను వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది.

చిత్రం..జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ బస్తీ దవాఖానలో చిన్నారికి
పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్