తెలంగాణ

ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు ఎథిక్స్- హ్యుమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎథిక్స్- హ్యుమన్ వాల్యూస్ పరీక్షకు 4,61,748 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,47,091 మంది హాజరయ్యారు. 14,657 మంది గైర్హాజరయ్యారు. ఇక ఎన్విరాన్‌మెంటల్ పరీక్షకు 4,61,844 మంది రిజిస్టర్ చేసుకోగా, 4,46,804 మంది హాజరయ్యారు. 15,040 మంది గైర్హాజరయ్యారు.
ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్స్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి ప్రారంభం కానున్నాయి. 4 విడతలుగా ఫిబ్రవరి 21 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం తెలంగాణలో 1632 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,66,364 మంది ఎంపిసి, 91,745 మంది బైపిసి, 422 మంది జాగ్రఫీ, 74, 949 మంది ఒకేషనల్ విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 6,410 మంది లెక్చరర్లను ఎంపిక చేశారు. డిపార్టుమెంటల్ ఆఫీసర్లను కూడా నియమించామని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, హైపవర్ కమిటీలు, జిల్లా పరీక్షల కమిటీల ఏర్పాటు పూర్తయిందని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ చెప్పారు. పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్‌లో పంపుతామని, అలాగే మార్కులను కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. దీనివల్ల అక్రమాలకు తావుండదని తెలిపారు.