తెలంగాణ

నన్నూ చంపుతారేమో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ‘ప్రభుత్వ వైఫల్యాలను బహిరంగంగా ఎండగడుతున్నందున నన్నూ చంపుతారేమో..!’ అని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి. హనుమంత రావు అనుమానం వ్యక్తం చేశారు. నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్‌ను కిరాతకంగా హత్య చేయించారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓటమి భయంతో ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తున్నదని విహెచ్ విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాల గురించి మాట్లాడుతున్న టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను, తననూ చంపే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావుకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి ఆహ్వానం రాలేదని ఆయన తెలిపారు. ఒకవేళ వస్తే ఆహ్వానాన్ని చూపించాలని విహెచ్ డిమాండ్ చేశారు.
సీబీఐకి అప్పగించాలి..
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకం ఉంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా రాజకీయ హత్య అని, ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్‌పి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్‌లో సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి