తెలంగాణ

పంటల బీమాకు ఆరు క్లస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: పంటల బీమాకు 2018 ఖరీఫ్‌లో ఆరు క్లస్టర్లు ఉంటాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. పంటల బీమాపై రాష్టస్థ్రాయి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది. 2018 ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ పంటల బీమాలను కలిపి ఉమ్మడిగా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, సోయాబీన్, పసుపు, వేరుసెనగ, పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ఉన్నాయి. పత్తి, మిర్చి, బత్తాయి, పామాయిల్ పంటలు సవరించిన వాతావరణ ఆధారిత బీమా కింద ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రెండు పంటలకు బీమాను అమలు చేస్తుంది.
టిఎస్‌సిఎబి 2018-19 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను అందచేస్తుందన్నారు. యూనిఫైడ్ ప్యాకేజీ స్కీం కింద జిల్లాలు గతంలో నిర్ణయించిన విధంగానే కొనసాగతాయి. విధి విధానాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు అవుతుందని పార్థసారథి తెలిపారు. ఈ సమావేశంలో వ్యసాయ శాఖతో పాటు బీమా కంపెనీల అధికారులు పాల్గొన్నారు.