తెలంగాణ

పెట్టుబడులు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)కు హాజరైనందుకు వేల కోట్లాది రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెబుతున్నదంతా అబద్ధం అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ సర్పంచ్, టిఆర్‌ఎస్ నాయకులు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం రాలేదని, ఆహ్వానం అందిందని చెప్పడం బూటకమని విమర్శించారు. పారిశ్రామికవేత్త బిఆర్ శెట్టి నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు కుదిరినట్టు చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. శెట్టి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో మూడు వేలల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం చేసుకున్నారని, చివరకు మూడు రూపాయలు కూడా పెట్టలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం చేసుకున్నారే తప్ప పెట్టుబడి పెట్టలేదని ఆయన తెలిపారు.