తెలంగాణ

నాణ్యమైన విత్తనాలే వాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు.
రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ సంస్థ కొత్త కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలమేరకు పనిచేస్తున్నామని విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు. ప్రైవేట్ రంగం వాళ్లు నాసిరకం విత్తనాలు ఉత్పత్తి, సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విత్తనోత్పత్తి సంస్థకు అవసరమైన నిధులు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశీయ విత్తన భాండాగారం నుండి ప్రపంచ విత్తన భాండాగారంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
తెలంగాణ విత్తన, సేంద్రీయ ధృవీకరణ సంస్థ కేవలం దేశీయ విత్తన ధృవీకరణతో పాటు అంతర్జాతీయ విత్తన ధృవీకరణ, సేంద్రీ ధృవీకరణ అనే మరో రెండు విభాగాలను ప్రారంభించామని పార్థసారథి తెలిపారు. గత ఏడాది సుమారు 17 వేల క్వింటాళ్ల జొన్న, మొక్కజొన్న, వరి తదితర విత్తనాలను ఈజిప్టు, సూడాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు ఎగుమతి చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ ప్రతిభను గుర్తించిన కేంద్రం దక్షిణ భారత్‌కు చెందిన తొమ్మిది రాష్ట్రాల్లో అంతర్జాతీయ విత్తన ధృవీకరణ అధికారాలను తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థకు అప్పగించిందని గుర్తు చేశారు. ఈ సంస్థ మొట్టమొదటి సారి ఆన్‌లైన్ విత్తన ధృవీకరణ విధానాన్ని ప్రారంభించిందని, దాంతో కల్తీవిత్తనోత్పత్తిని నియంత్రించగలిగామన్నారు.
విత్తన ధృవీకరణ సంస్థకు వ్యవసాయ శాఖ ద్వారా అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ హామీ ఇచ్చారు.