తెలంగాణ

బాపూజీకి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నార్సింగి, జనవరి 30: జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రులు, నాయకులు ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. లంగర్‌హౌస్ బాపూఘాట్‌లో మంగళవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్మారక భవనంలో కూడా జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సామూహికంగా రాఘపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం...అంటు గీతాలాపన గావించారు. కాగా హిందు, ముస్లిం, బుద్ద, సిక్కు, క్రైస్తవ సర్వమత గురువులు ప్రార్థనలు నిర్వహించారు. బాపూఘాట్ ఆవరణలోని జాతిపిత విగ్రహానికి కూడా ప్రత్యేకంగా నివాళ్లు అర్పిచారు. అమరవీరులను స్మరిస్తూ గాంధీజీ విగ్రహాం వద్ద పదకొండు గంటలకు రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. రాష్ట్ర గవర్నర్ నర్సింహన్, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహాముద్ అలీ, కడియం శ్రీహారి, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, ఎంపీలు మల్లారెడ్డి, సీతారామ్‌నాయక్, ఎమ్మెల్యే, పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌పీ సింగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ కమీషనర్ భారతీ హోళికేరీ, కార్వాన్ నియోజకవర్గం బి-బ్లాక్ అధ్యక్షుడు కె. చంటిబాబు, హైదరాబాద్ ఆర్‌డీవో చంద్రకళ, జలమండలి గోషామహెల్ సీజీఎం స్వామి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కావురి వెంకటేశ్, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బాపూఘాట్‌లో జాతిపితకు నివాళి అర్పిస్తున్న గవర్నర్ నరసింహన్, మంత్రులు