తెలంగాణ

ప్రతిపాదనలు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్‌లో కేటాయించడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. బడ్జెట్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్, పట్టాణాభివృద్ధిశాఖలకు కేటాయించే నిధుల ప్రతిపాదనలపై మంగళవారం సంబంధిత అధికారులతో మంత్రి చర్చించారు. వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రాజెక్టులు, ప్రస్తుతం పురోగతిలో ఉన్న కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులకు అంచనాలు తయారు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటికిగాను ఏ మేరకు నిధులు అవసరం అవుతాయో ప్రతిపాదనల్లో పొందుపర్చాలన్నారు. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో చేపడుతున్న కేశవాపురం రిజర్వాయర్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు అవసరమైన నిధులపై కూడా మంత్రి ఆరా తీసారు. హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్‌లకు సంబంధించిన ప్రాజెక్టులకు అవసరమైన నిధులపై ఆయా విభాగాలకు చెందిన అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, పట్టణాభివృద్దిశాఖ అధికారులు, హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి, హైచ్‌ఎంఆర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో మంగళవారం సమావేశమైన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు