తెలంగాణ

ట్రిపుల్ తలాక్ చట్టంతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జనవరి 30: ముస్లిం పర్సనల్ లాబోర్డుతోనే మహిళలకు పూర్తి రక్షణ ఉందని ఎంఐఎం. అధ్యక్షుడు, ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు, ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాగారెడ్డి స్టేడియంలో సోమవారం రాత్రి ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగసభకు ఎంపీ అసదుద్ధీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం సమాజానికి ముప్పు ఉందని హెచ్చరించారు. యువత అప్రమత్తంగా ఉండాలని, జిందాబాద్‌లతో కాలం వెళ్లదీయరాదన్నారు. మోదీ ప్రభుత్వ పోకడలను నిశితంగా గమనించి ప్రజలను చైతన్య పర్చాలన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో పాసై రాజ్యసభ ముందుకు రాబోతుందన్నారు. దీంతో ముస్లిం సమాజానికి తీరని నష్టం వాటిల్లనుందని హెచ్చరించారు. ఎవరైనా మహిళలను ట్రిపుల్ తలాక్‌తో వేధిస్తే వారిని సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. కానీ చట్టంచేస్తే భర్త జైలుకు, భార్య వీధిపాలౌతుందని హెచ్చరించారు. ట్రిపుల్ తలాక్‌తో వివాహ సంబంధానికి ముప్పుండదని మైనర్‌కోర్టు తీర్పుచెప్పినా చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోందన్నారు. దేశంలో ఒంటరి మహిళలు 25లక్షలకుపైగా ఉన్నారన్నారు. వారిని ఆదుకోవాలని కనీసం నెలకు రూ.15వేలిచ్చి ఆదుకోవాలన్నారు. ముస్లిం పర్సనల్ లాబోర్డులో మహిళలకు పెద్దపీట వేసినట్టు ఆయన చెప్పాఠు. ఏ మతంలో కూడా అంతటి ప్రాధాన్యత నీయలేదన్నారు. పురుషుల తో సమానంగా హక్కులిచ్చిందన్నారు. ట్రిపుల్ తలాక్‌తో హక్కులను హరించే కుట్రను మోదీ ప్రభుత్వం చేస్తుందన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, యాక్షన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి.యూసుఫ్, మోహీజ్ ఇతర పద్దెలు, ఎంఐఎం పార్టీ నాయకులు అజ్మత్ పాషా, సమియొద్దీన్, ఎండి. లుక్మాన్, మొహియోద్ధీన్ గౌరీ ఇతర నాయకులు, వివిధ గ్రామాలనుంచి తరలి వచ్చిన వేలాది మంది ముస్లిం సోదరీ, సోదరిమణులున్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ