తెలంగాణ

అడవులు నరికినా, వన్యప్రాణులను సంహరించినా కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: అడవులు నరికినా, వన్య ప్రాణులను సంహరించినా మరింతగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. వారం రోజుల పాటు జరిగిన పులుల జంతు గణనలో పాల్గొన్న వాలంటీర్లతో అటవీ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం అరణ్య భవన్‌లో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ ప్రదాన అధికారులు పీకె ఝూ, మనోరంజన్ భాంజా, మునీంద్ర, ఒఎస్‌డి శంకరన్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, శివానీ డోగ్రా తదితరులు పాల్గొన్నారు. పులుల సంచా రం, ఆవాసాల వృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని, అడవుల్లో నీటి చెలిమలు, కాలువలు, నదుల కాలుష్యకారకాలను గుర్తించి తక్షణం అడ్డుకట్ట వేయాలని, అడవుల నరికి వేత, జంతువుల వేట, స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు స్థానికులకు అవగాహన కల్పించి, ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చేలా చర్యలు, అటవీ ప్రాంతాల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు సేకరించే సిబ్బంది సంఖ్య పెంచాలని, స్థానికులకు అవకాశం కల్పించాలని, అడవుల్లో వాహనాల వేగానికి అడ్డుకట్ట వేసేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రానున్న రోజుల్లో స్పీడ్ గన్స్ ప్రయోగం పరిశీలన చేయాలని, అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మద్యపానం అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేయాలని తదితర సిఫార్సులను వాలంటీర్లు చేశారు. జంతు గణన సందర్భంగా అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లతో సహా అన్ని ప్రాంతాల్లోని అటవీ జంతువుల సంఖ్య ప్రోత్సాహకంగా ఉందని, అయితే ఈ గణనను శాస్ర్తియంగా విశే్లషించి, జంతువుల ఖచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.