తెలంగాణ

ప్రభుత్వ వైద్యులకు వెన్నుదన్నుగా సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రతినిధులు మంగళవారం మంత్రిని సచివాలయంలో కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. వివిధ సమస్యలను పేర్కొంటూ మంత్రికి ఒక వినతిపత్రం అందచేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గతంలో తమ ముందుంచిన సమస్యల్లో చాలా సమస్యలను పరిష్కరించామని, పరిష్కారం కాని ఇతర సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీచింగ్ డాక్టర్లకు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం, రవాణా అలవెన్స్, డిహెచ్ క్యాడర్ స్ట్రెంత్, హెల్త్ కార్డులు తదితర సమస్యలను మంత్రి దృష్టికి సంఘం ప్రతినిధులు తీసుకువచ్చారు. 15 రోజుల్లోగా ఈసమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి లక్ష్మారెడ్డి తక్షణమే ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ ఔషధ సేవల వౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండి వేణుగోపాలరావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిఎంఇ డాక్టర్ రమేష్‌రెడ్డి, తెలంగాణ ప్రనుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, ఉపాధ్యక్షుడు నరహరి, కోశాధికారి లల్లూప్రసాద్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.