తెలంగాణ

‘మేడారం’ జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: మేడారం జాతరకు జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మేడారం జాతరలో వైద్య సౌకర్యాలను కల్పించేందుకు బిజెపి డాక్టర్స్ సెల్ తరఫున నాలుగు అంబులెన్స్‌లు పంపించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి వైద్య అవసరమున్నప్పటికీ అంబులెన్స్‌ల ద్వారా వైద్య సదుపాయాలను అందిస్తారని, అందుకోసం డాక్టర్ల భబృందం మేడారం వెళుతుందని అన్నారు. ఆదివాసీల పండుగగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్న ప్రాధాన్యతను ప్రధాని నరేంద్రమోదీకి వివరించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే జాతరకు అరకొర ఏర్పాట్లు చేసిందని, దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. మేడారం జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జుయేల్ ఓరాం, కేంద్ర పర్యాటక మంత్రి ఆల్ఫోన్స్, చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రామన్‌సింగ్ వస్తున్నట్టు ఆయన చెప్పారు. ఫిబ్రవరి 1న రమన్‌సింగ్ వస్తారని, ఉదయం 10 గంటలకు రాయ్‌పూర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం హెలీప్యాడ్‌లో దిగుతారని, అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని అదే రోజు హెలికాప్టర్‌లో జగదల్‌పూర్ చేరుకుంటారని అన్నారు.
మరుసటి రోజు 2వ తేదీన జువెల్ ఓరం జాతరకు వస్తారని, జనవరి 3న బిజెపి నాయకులు అంతా బృందంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారని పేర్కొన్నారు.
ఉచిత రవాణా కల్పించాలి
జాతరకు వచ్చే గిరిజనుల వద్ద ఆర్టీసీ అధికారులు రెట్టింపు చార్జీలను వసూలుచేస్తున్నారని, చాలా మంది గిరిజనులు పేదవారేనని, వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉందని బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి అన్నారు. అవసరమైతే ఉచిత భోజన వసతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
మహాత్మాగాంధీ వర్ధంతి
నవ భారత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో జరిగిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి కార్యక్రమంలో డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. గాంధీజీ ఆశయాల అమలుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి నేతలు జి కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ఆకుల విజయ, దళిత మోర్చ అధ్యక్షుడు వేముల అశోక్, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.