తెలంగాణ

శాంతి భద్రతల విషయంలో రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: శాంతి భద్రతల విషయంలో రాజీపడకుండా, చట్టం ప్రకారం విధులు నిర్వహించాలని ఆర్మ్‌డ్ పోలీసు కానిస్టేబుల్స్‌కు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ గోషామహల్‌లో 9 నెలల పాటు పోలీసు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకుని పూర్తి స్థాయి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేందుకు 405 మంది ఆర్మ్‌డ్ పోలీసు కానిస్టేబుల్స్‌కు దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘవిద్రోహశక్తుల పీచమణచాలని కోరారు. భారతీయ శిక్షాస్మృతి, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, నేర విచారణ స్మృతి, శాంతి భద్రతలు, భద్రత, పోలీసు పరిపాలన అనేక ప్రాంతీయ చట్టాలను కూలంకషంగా అధ్యయనం చేయాలని కోరారు. వీటి గురించి శిక్షణ సమయంలో చెప్పిన విషయాలను గుర్తుంచుకుని విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సమాజంలో మహిళలపై నానాటికి పెరుగుతున్న లైంగిక వేధింలు, లిగ వివక్షత , మానవ అక్రమ రవణా వంటి వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన అంశాలపై శిక్షణలో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వ్యక్తిత్వ వికాసంతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో బెస్ట్ ఆల్ రౌండర్ ట్రైనీగా ఎం నరేష్, ఇండోర్ సబ్జెక్టుల్లో ఉత్తమ ట్రైనీగా పి రవి, అవుట్‌డోర్ సబ్జెక్టుల్లో ఉత్తమ ట్రైనీగా ఎస్ పూర్ణ చందర్, ఉత్తమ ఫైరర్‌గా వి శివకుమార్ ఎంపికయ్యారు. గోషామహల్ లెర్నింగ్ సెంటర్‌లో బెస్ట్ ఆల్ రౌండర్ ట్రైనీగా ఒ శ్రీకాంత్, ఇండోర్ సబ్జెక్టుల్లో ఉత్తమ ట్రైనీగా వి శ్రీహరి విష్ణు, ఔటర్ సబ్జెక్టుల్లో ఉత్తమ ట్రైనీగా సిహెచ్ అంజయ్య, రియాజ్ హుస్సేన్‌గా ఉత్తమ ఫైరర్ ఎంపికయ్యారు. వీరికి పోలీసు కమిషనర్ మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈకార్యక్రమంలో పిటిసి ప్రిన్సిపాల్ బిఎస్‌పి రవికుమార్, అదసనపు కమిషనర్ ఆఫ్ పోలలీస్ ఎం శివప్రసాద్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ నుంచి 115 మంది, నిజామాబాద్ నుంచి 54 మంది, ఖమ్మం నుంచి 116 మంది, కరీంనగర్ నుంచి 93 మంది, వరంగల్ నుంచి 24 మంది, మహబూబ్‌నగర్ నుంచి 3 ఎస్‌సిటిపిలుగా నియమితులయ్యారు. వీరిలో 111 మంద పిజిలు, 170 మందిగ్రాడ్యూయేట్లు, 78 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లు, మిగిలిన వారు ఇంటర్ అర్హత కలిగి ఉన్నారు.

చిత్రం..దీక్షాంత్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న వివి శ్రీనివాసరావు