తెలంగాణ

అమ్మవార్ల సేవలో దేవాదాయ మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, జనవరి 31: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ... మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 80కోట్ల రూపాయలు విడుదల చేయడంతో జాతరలో అభివృద్ధి పనులు భక్తుల సౌకర్యార్థం చేపట్టామన్నారు. దీంతో మేడారం జాతరకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, ఇప్పటి వరకు 30లక్షలకు పైగా భక్తులు అమ్మలను దర్శించుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈనెల 2వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, భారత ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడులు అమ్మవార్లను దర్శించుకోనున్నట్టు, అందుకు తగ్గట్టుగా ఏర్పాటుచేయనున్నట్టువివరించారు.