తెలంగాణ

కువైట్‌లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న కార్మికులను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. కువైట్ దేశంలో తెలంగాణ వాసులు సుమారు 50 వేల మంది నానా యాతన పడుతున్నారని, దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆయన తెలిపారు. కాబట్టి వారందరినీ తెలంగాణకు తీసుకున వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను కువైట్‌కు పంపించాలని ఆయన సూచించారు. ఇతర దేశాలలో ఉన్న ప్రవాస తెలంగాణవాసుల గురించి టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో పెద్ద మాటలు చెప్పిందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని గల్ఫ్ పర్యటనలకు వెళ్ళిన టిఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు విలాసాలు చేశారే తప్ప సమస్యలు పరిష్కరించలేదన్నారు. కొంత మంది బతుకమ్మ ఆటలు ఆడి సంబరాలు నిర్వహించారని డాక్టర్ శ్రవణ్ తెలిపారు. పిసిసి నుంచి ఒక ప్రత్యేక బృందం గల్ఫ్ బాధితుల పరిరక్షణ కోసం వెళ్ళనున్నట్లు ఆయన చెప్పారు. గల్ఫ్ బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.