తెలంగాణ

మూడు వారాల్లో కౌంటర్ దాఖలుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 31: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హత్య కేసును సిబిఐతో విచారణ జరిపించాలంటూ లక్ష్మి వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం లక్ష్మి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్‌రావును ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. లక్ష్మి పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో శ్రీనివాస్ హత్య కేసు మరో మలుపు తిరిగినట్లయ్యింది. తన భర్త శ్రీనివాస్‌ను రాజకీయ కుట్రతో హత్య చేశారని దీనిపై నల్లగొండ పోలీసులు సరైన విచారణ చేయకుండా నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారంటు లక్ష్మి పిటిషన్‌లో ఆరోపించారు. తన భర్త కేసులో నిజానిజాలు వెలికితీసి నిజమైన దోషులను గుర్తించేందుకు సిబిఐ లేదా సిట్ విచారణ జరిపించాలంటూ ఆమె కోర్టును కోరారు. ఈ కేసులో జిల్లా పోలీసులు సమర్పించే కౌంటర్ దాఖలుపై హైకోర్టు సంతృప్తి చెందని పక్షంలో కేసును పిటిషనర్ కోరినట్లుగా సిట్ లేదా సిబిఐకి అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు.