తెలంగాణ

టిఆర్‌ఎస్‌లో చేరనందుకే శ్రీనివాస్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తమ పార్టీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ టిఆర్‌ఎస్‌లో చేరనందుకే హత్య చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. ముమ్మాటికీ ఇది రాజకీయ హత్యేనని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఈ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించామని ఆయన తెలిపారు. కాల్ డేటా ఇవ్వబోమని సిఎం అనుయాయలు చెబుతున్నారని అన్నారు. ఆ మాట హోం మంత్రి లేదా డిజిపి చెప్పాలని అన్నారు. సిఎం హత్యా రాజకీయాలకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని ఆయన తెలిపారు. మార్చిలోగా 50 శాతం అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియాకు చెప్పానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పాదయాత్ర చేపట్టాలని సూచించానని ఆయన చెప్పారు. తనకు బాధ్యత అప్పగిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని కోమటిరెడ్డి తెలిపారు. నల్లగొండలో అన్ని స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విహెచ్ ఆందోళన
ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయని విమర్శించారు. దేశంలో హత్యల్లో తెలంగాణ నెంబర్-1 స్థానాన్ని ఆక్రమించుకున్నదని ఆయన విమర్శించారు. శాంతి-్భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాల గురించి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాయనున్నట్లు విహెచ్ చెప్పారు.