తెలంగాణ

పాఠకులకు పది రూపాయలకే మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 31: నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ రాష్ట్రానికే ఆదర్శనీయమైన రీతిలో నేటి నుంచి పాఠకులకు పది రూపాయలకే మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు, పుస్తక ప్రియులకు, పోటీ పరీక్షల విద్యార్థులకు చౌకగా పది రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించనుండటం ఇతర గ్రంథాలయాలకు స్ఫూర్తిగా నిలువబోతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేఖల భద్రాద్రి సొంత ఖర్చుతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆదర్శనీయంగా నిలిచారు. నిత్యం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 800మంది వరకు పాఠకులు వస్తుండగా ఇందులో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు 300మందికి పైగా వివిధ గ్రామాల నుండి ఇక్కడి వస్తున్నారు. వారు అర్ధాకలితో బాధపడకుండా తమ చదువులు సాగించేలా భద్రాది పది రూపాయలకే మధ్యాహ్న భోజన పథకం అమలుకు ముందుకు వచ్చారు. ఈ పథకంతో కనీసం రోజు 150మందికి పైగా మధ్యాహ్న భోజనం అందించనుండగా మునుముందు దాతల సహకారం లభించినట్లయితే మరో వంద మందికి భోజనం అందించాలని భావిస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రస్తుతం 70వేల పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నుంచి, దాతల నుంచి అందిన సహకారంతో పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు సమకూర్చగా పాఠకుల సంఖ్య పెరిగిపోయింది. చైర్మన్ భద్రాద్రి ప్రారంభించిన పది రూపాయల మధ్యాహ్నా భోజన పథకం విజయవంతమైతే ఇదే బాటలో రాష్ట్రంలోని మరిన్ని గ్రంథాలయాలు సాగుతాయని భావిస్తున్నారు.