అంతర్జాతీయం

భారత్-పాక్ చర్చలతో వాణిజ్యం పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా ఆశాభావం

వాషింగ్టన్, డిసెంబర్ 17: భారత్, పాకిస్తాన్‌ల మధ్య సమగ్ర చర్చలు తిరిగి ప్రారంభం కావడం చెప్పుకోదగ్గ పరిణామమని అమెరికా అభిప్రాయపడుతూ ఈ చర్చలు తిరిగి ప్రారంభం కావడం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. ‘్భరత్, పాకిస్తాన్ మధ్య సంబంధాల్లో ఇటీవల వచ్చిన మార్పు చెప్పుకోదగ్గ పరిణామమని అమెరికా ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ పాకిస్తాన్‌పై ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అఫ్గానిస్థాన్, పాకిస్తాన్‌లపై అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ ఓస్లోన్ అన్నారు. బ్యాంకాక్‌లో భారత్, పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశమయ్యారని, ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్‌లో జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు హాజరై పాక్‌కు స్నేహహస్తాన్ని అందించారని, పాక్ సైతం దాన్ని స్వాగతించిందని ఆయన చెప్పారు. సమగ్ర చర్చలను తిరిగి ప్రారంభించాలని ఇరుదేశాలు అంగీకరించాయని, దీనివల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేసుకోవాలనేది తమ సహాయ కార్యక్రమాల్లో నొక్కి చెప్తున్న అంశాల్లో ఒకటని, అందువల్ల సమగ్ర చర్చలు తిరిగి ప్రారంభం కావడం వాణిజ్యం ప్రధానంగా భారత్, పాక్‌ల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నామని రిచర్డ్ ఓల్సోన్ అన్నారు. ఇది రెండు దేశాలకు ముఖ్యంగా పాకిస్తాన్‌కు మేలు చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుత అమెరికా కాంగ్రెస్‌లో ఏకైక భారతీయ అమెరికన్ అయిన అమి బేరా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఓల్సో ఈ విషయం చెప్పారు. 2008 ముంబయి ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ ఎంతో సంయమనాన్ని పాటించిందని అంటూ లష్కరే తోయిబా, హక్కానీ నెట్‌వర్క్, ఇతర ఉగ్రవాద ముఠాలను అణచివేసే విషయంలో పాకిస్తాన్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని ఆశించానని బేరా అన్నారు.