తెలంగాణ

వ్యవసాయ శాఖలో రూ.3.13 కోట్లు స్వాహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 22: ఐదేళ్లుగా జీవనోపాధి కల్పిస్తున్న కన్నతల్లి లాంటి శాఖకు ఏకంగా ఓ చిరు ఉద్యోగి పెద్ద మొత్తంలో సున్నం పెట్టాడు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ రూ.3.13 కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది. రైతులకు సబ్సిడి పనిముట్ల కొనుగోలు చేసిన ఎజెన్సీలకు చెల్లించాల్సిన 3,13,35,000 వేల రూపాయలను ఆన్‌లైన్ ఖాతాల ద్వారా మల్లించినట్లు వెలుగు చూడటంతో అధికారులు నిర్ఘాంతపోతున్నారు. జెడి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న కె.మాణయ్య మొత్తం 23 చెక్కులను తస్కరించి పోర్జరి సంతకాలు, తప్పుడు ప్రొసిడింగ్‌ల ద్వారా గత నెల 31నుండి ఈ నెల 13వ తేదీ వరకు 23 చెక్కుల 3.13 కోట్ల పైచీలుకు మొత్తాన్ని సంగారెడ్డి ఎస్‌బిహెచ్, శాంతినగర్ ఎపిజివిబి శాఖల నుండి ఆర్టీజిఎస్ ద్వారా ఇంటర్నేషనల్ అకౌంట్స్‌కు మల్లించారు. ఈ నెల 20న మరోసారి బ్యాంకు లావాదేవిలకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది జెడి హుక్యానాయక్‌కు సమాచారం ఇవ్వడంతో ఆరా తీశారు. దీంతో జెడి సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంప్యూటర్ ఆపరేటర్ మాణయ్యను అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై జెడి హుక్యానాయక్‌ను వివరణ కోరగా గత ఐదేళ్లుగా మాణయ్య నమ్మకంగా పని చేస్తుండడంతో బ్యాంకు లావాదేవిలు, వ్యక్తిగత ఖాతాల నిర్వాహణను సైతం అప్పగించడం జరిగిందన్నారు. చెక్కు బుక్‌లో నుండి 12 చెక్కులను కాజేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. గత నెల 31నుండి ఈ నెల 13వ తేదీ మద్యకాలంలోనే తస్కరించిన చెక్కులను పోర్జరి సంతకాలు, ప్రొసిడింగ్‌లతో ఇతర ఖాతాలకు మల్లించాడన్నారు. చిరు ఉద్యోగి అయిన కంప్యూటర్ ఆపరేటర్ వెనకాల ఎవ్వరైన పెద్దల హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు.